నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో `ఛలో` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అయితే నేషనల్ క్రష్ అయిన రష్మిక కుర్రకారును ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యను సైతం పడేసిందట.
అసలు విషయం ఏమిటంటే.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇటీవల సీజన్ 2 లో అడుగుపెట్టి ఫస్ట్ ఎపిసోడ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
ఈ షోలో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ బాలకృష్ణతో కలిసి సందడి చేయడం గమనార్హం. బాలయ్య సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చూసి ఎవరయ్యా సిద్దుకి తలదొవకుండా పంపించారంటూ కామెంట్ చేశారు. సిద్ధూ అది మెస్సీ లుక్ అని చెప్పగా నేను అలాంటి మెస్సీ లుక్ తో కనబడిన సినిమాలన్నీ మెస్ అయ్యానంటూ బాలయ్య చెప్పుకోవచ్చారు. అందులో భాగంగానే బాలకృష్ణను తన క్రష్ ఎవరని ప్రశ్నించగా బాలయ్య వారికి షాకింగ్ సమాధానం ఇచ్చారు. అదేమిటంటే తన క్రష్ రష్మిక మందన్న అంటూ ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక నా మజాకా? ఏకంగా బాలయ్యనే పడేసిందిగా.. అంటూ వార్తలు వస్తున్నాయి.