ఆ గుట్టు చెప్పవమ్మ క్రషిక..నెటిజన్స్ కరెక్ట్ పాయింట్ అడిగారుగా..?

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైలోనే..బడా బడా స్టార్స్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ..క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ..అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక..ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో ల ఫేవరేట్ ఛాయిస్ అయ్యింది. వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలకు కమిట్ అవుతూ..బాలీవుడ్ ముద్దుగుమ్మలకు గట్టిపోటీ ఇస్తుంది.

ప్రజెంట్ నాలుగు బాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టుకుని ఉన్న ఈ బ్యూటీ..రీసెంట్ గా మరో కిర్రాక్ ఆఫర్ ని అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బాలీవుడ్ టైగర్ శ్రోఫ్ తదుపరి సినిమాలో రష్మిక హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ శశాంక్ ఖైతన్ రష్మిక స్టోరీ చెప్పి…ఆమె డేట్స్ ని లాక్ చేశారట. రేపో మాపో ఆఫిషీయల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే, సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్ళు దాటినా ఇలాంటి బాలీవుడ్ ఆఫర్స్ అందుకోలేని ముద్దుగుమ్మల లిస్ట్ చూయిస్తూ నెటిజన్స్ రష్మిక ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. “ఏ మాయ చేశావు బాలీవుడ్ హీరోలని క్రష్మిక” అంటూ కరెక్ట్ పాయింట్ ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్. బాలీవుడ్ బడా బ్యూటీస్ ను కాదని..అక్కడి దర్శకులకు రష్మికనే ఎందుకు నచ్చిందో ఇప్పటికి అర్ధంకానీ ప్రశ్న గానే మిగిలిపోయింది. మరి దీనికి రష్మిక ఆన్సర్ ఇస్తుందా..?