తెలిసి తెలిసి తప్పు చేస్తున్న తెలుగు హీరోలు.. కాస్త బుర్ర వాడండయ్యా..?

సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోలుగా ఉన్న వారు నేడు ఇండస్ట్రీలో జీరోలు అవుతున్నారు. ఒకప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే హీరోలు..ఇప్పుడు నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెడుతున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా దిగులు పడాల్సిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న ..కధ లో కంటెంట్ లేకపోవడం..సినిమా డిజాస్టర్ కు బిగ్గెస్ట్ ఫ్లాప్ పాయింట్ అవుతుంది.

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బడా స్టార్ హీరోల సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి. రిలీజ్ కు ముందు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా..రిలీజ్ తరువాత మాత్రం టాక్ మరోలా ఉంటుంది. దానికి బెస్ట్ ఉదాహరణలు..ప్రభాస్, చిరంజీవి, రవితేజ . ఈ ముగ్గురు హీరోలకి ఇండస్ట్రీలో ఎలా పేరుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముగ్గురుకు ముగ్గురే..దేనిలో తీసిపోరు. వీళ్ళ గత సినిమా ట్రాక్ రికార్డులు చూసిన మనకు ఆ విషయం అర్ధమవుతంది.

కానీ, రీసెంట్ టైంలో వీళ్ళ సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. చిరంజీవి కి సెకండ్ ఇన్నింగిస్ లో చెప్పుకోతగ్గ హిట్ పడలేదు అన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయిన ఆచార్య..దారుణమైన టాక్ ను సొంతం చేసుకుంది. డిస్ట్రీబ్యూటర్స్ రొడున పడ్డారు అంటే పరిస్ధితి. ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలానే , ప్రభాస్ రాధే శ్యామ్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కోట్లు కుమ్మరించారే కానీ, సినిమాలో కంటెంట్ లేదు.

ఇక రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటి సినిమా రవితేజ అభిమానులకు నచ్చిందే కానీ, మిగతా జనాలకు మాత్రం తలనొప్పి తెప్పించింది. కలెక్షన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సినిమా స్టోరీలు రవితేజ ఆల్ రెడీ చేసేసారు..అందుకే జనాలకు పెద్దగా ఎక్కలేదు. ఇలా హీరోలు చేసిన కధనే మళ్లీ చేస్తూ.. కొందరు చీప్ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటూ..ఉన్న క్రేజ్ ని తగ్గించేసుకుంటున్నారు. కనీసం మన అభిమానులు మన నుండి ఏం కోరుకుంటున్నారో సినిమాకు సైన్ చేసే ముందు బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇలాంటి తప్పులు జరగవు అన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరి చూడాలి నెక్స్ట్ సినిమాలతో అయినా వీళ్లు హిట్లు కొడతారు ఏమో ..?