దేవర ‘ క్లైమాక్స్ లీక్.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేవర సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా.. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్యన జరిగే వార్ సీన్స్‌ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటాయట.

Jr NTR-starrer 'Devara Part 1' now locks Sept 27 as release date - The  Statesman

కొరటాల శివ తనదైన స్టైల్ లో సినిమాలు రూపొందించారు. యాక్షన్ సీన్లు, ఎమోషన్స్ సీన్స్, కామెడీ ఇలా ప్రతి ఎలిమెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు కొద్ది రోజులకు ముందే సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ట్రైలర్ లో ఎన్టీఆర్ యాక్షన్ అవతార్.. అలాగే సినిమాపై హైప్‌ క్రియేట్ చేసేందుకు కొన్ని కీలక అంశాలను బయటపెట్టే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు బయటకు వచ్చిన దేవర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Jr NTR's 'Devara Part 1' release date out, makers announce with new poster  - India Today

ఇక దేవ‌ర‌ పార్ట్ 1 క్లైమాక్స్ సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన క్లైమాక్స్ లన్నీ ఒక ఎత్తు అయితే దేవర క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా సరికొత్తగా ఉంటుందని.. ఈ సినిమా క్లైమాక్స్ మరో రేంజ్ లో ఉండబోతుందని.. యాక్షన్ అభిమానులకు మూవీ క్లైమాక్స్ మంచి ఫీస్ట్ అంటూ.. అభిమానుల‌కు గుస్ బంప్స్ ఖాయం. పండగ చేసుకుంటారంటూ.. దేవర ఊచకోత శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక సినిమాతో బాక్స్‌ ఆఫీస్ బ్లాస్ట్‌ కాయమంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్ లో అంచనాలతో సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.