ఫస్ట్ మూవీతోనే తండ్రిని మించిన తనయుడిగా మోక్షజ్ఞ..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎదురు చూడడం.. అభిమానులకు నిరాశ ఎదురవడమే జరుగుతుంది. అయితే ఎట్టకేలకు తాజాగా మోక్షజ్ఞ ఆగ‌మ‌నానికి స‌మ‌యం వ‌చ్చేసింది. త్వరలోనే నందమూరి బాలయ్య త‌న‌యుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించనున్నాడు. హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ తెరకెక్కనుంది.

ఈ క్రమంలో ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఇందులో త‌న స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు మెక్షు. నిన్న మొన్నటి వరకు కాస్త లావుగా కనిపించడంతో ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొన్న మోక్షజ్ఞ.. ఒక్కసారిగా స్లిమ్‌లుక్‌తో కనిపించి ఆడియ‌న్స్‌ను సర్ప్రైజ్ చేశాడు. ఇక ఎలాగైనా మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టాలని ఉద్దేశంతోనే ప్రశాంత్ వర్మతో సినిమా ఫిక్స్ చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు మోక్షజ్ఞ రెమ్యెనరేషన్ ఎంత అనే న్యూస్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మొదటి సినిమాకి హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడంటూ.. బాలయ్య కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ చూశారా.. బాలయ్య ఫ్యాన్స్‌ షాక్ అవ్వాల్సిందే.. –  News18 తెలుగు

ఏకంగా మోక్షజ్ఞ తన ఫస్ట్ సినిమా కోసం రూ.18 నుండి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలో నందమూరి అభిమానులు.. మోక్షజ్ఞ తండ్రిని మించిన తనయుడు అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం తన సినిమాకు రూ.18 కోట్ల రమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఇలాంటి టైంలో మొదటి సినిమాకే మోక్షజ్ఞ రెమ్యునరేషన్ రూ.18 నుంచి రూ.20 కోట్లు అని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులు ఎవరు.. హీరోయిన్గా ఎవరు నటించనున్నారనే అంశాల‌పై క్లారిటీ రావాల్సి ఉంది.