టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచు ఫ్యామిలీ నుంచి వెండితెరకు ఎంట్రీఇచ్చి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. డైలాగ్ కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. నట వారసులుగా కొడుకులను, కూతుర్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి ముగ్గురు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇక వీళ్ళలో మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా.. ప్రతిష్టాత్మక పదవిలో కొనసాగుతున్నాడు. అయితే అలాంటి మంచు విష్ణు విషయంలో వినిపించే ఒకే ఒక్క మైనస్ తన తమ్ముడు మనోజ్‌తో గొడవలు.
గత కొద్ది రోజులుగా మంచు బ్రదర్స్ మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు మనోజ్, భూమ మౌనికను వివాహం చేసుకోవడం.. మంచు ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదని.. అందుకే వీరి పెళ్ళిని కేవలం మంచు లక్ష్మీ మాత్రమే దగ్గరుండి అన్ని చూసుకొని చేసిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ పెళ్ళికి మోహన్ బాబు దంపతులు కూడా వచ్చారు. పెళ్లి చివరిలో మంచు విష్ణు, తన భార్య కూడా హాజరయ్యారు. అయితే తర్వాత మంచు విష్ణు.. మనోజ్ సన్నిహితులపై దాడి చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి అంటూ వస్తున్న వార్తలు నిజమేనని పరోక్షంగా తెలిసినట్లయితే కొద్దిసేపటికి ఆ వీడియోను డిలీట్ చేసేసారు.
అయితే తర్వాత వీరు వివాదం సర్దుమనిగిందని అంతా భావించారు. కానీ.. కొంతకాలానికి మంచు మనోజ్, మౌనికలకు పుట్టిన బిడ్డ బారసాల ఆహ్వాన పత్రికలోను మంచు విష్ణు దంపతుల పేరు కనిపించలేదు. దీంతో మరోసారి వీరి మధ్య గొడవలు ఇంకా సమస్యలు పోలేదంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. మనోజ్‌తో గొడవలపై స్పందించారు. వారిద్దరి మధ్యన గొడవల విషయంలో క్లారిటీ ఇచ్చారు. విష్ణు మాట్లాడుతూ మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. కొంతమంది కావాలనే గొడవలు క్రియేట్ చేసి రాసేసుకుంటున్నారు తప్ప.. ఎలాంటి సమస్యలు లేవని వివరించాడు.
అయితే నేను, నాన్నగారు ఒకే దగ్గర ఉంటున్నాం. ఇక అక్క, తమ్ముడు ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల తరచు కలుసుకోవడం సాధ్యం కావడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నవన్నీ నిరాధార వార్తలు. మా మధ్యన ఎలాంటి వివాదాలు లేవు అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద ఎంటర్టైనింగ్ షోలలో ఆలీతో సరదాగా కూడా ఒకటి. కమెడియన్ అలీ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోలో తాజాగా మంచు విష్ణు పాల్గొని సందడి చేశాడు. ఇందులో భాగంగానే అలీ అడిగిన ప్రశ్నకు విష్ణు రియిక్ట్ అవుతూ మనోజ్ తో గొడవ పై క్లారిటీ ఇచ్చారు.