మోక్షజ్ఞకు.. మెగా ఫ్యామిలీ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు.. సినీ ప్రియులు, టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు మెగాస్టార్ కొడుకుగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా భారీ సక్సెస్ అందుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఈ లిస్టులోనే స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో బాలయ్య ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అంటూ ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులందరికీ.. బాలయ్య కొడుకు ఎంట్రీ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెర‌కు పరిచయం కానున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. లెజెండ్ మూవీస్ బ్యానర్ పై బాలయ్య చిన్న కూతురు మోతుకుపల్లి తేజస్విని, ఎస్ఎల్వీ బ్యానర్ చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా తెర‌కెక్కుతున్న రెండో ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను ప్ర‌శాంత్ వ‌ర్మా ప్రకటించాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు.. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞకు విజయం దక్కాలని కెరీర్‌లో సక్సెస్ అందుకోవాలంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలో మెగా సుప్రీం హీరో.. సాయి దుర్గ తేజ్ కూడా మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపాడు. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించినందుకు తను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు వ్యక్తం చేశానని.. ఈరోజు నుంచి మీరు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉందంటూ పేర్కొన్నాడు. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరాభిమానాలు మీ సొంతం కావాలని.. అపురూపమైన తెలుగు సినిమాతో మీ సినీ రంగ ప్రవేశం శుభప్రదం అవుతుందని.. తాను భావిస్తున్నట్లు సాయి దుర్గా తేజ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మెగా హీరో నుంచి ఈ రేంజ్‌లో మోక్షజ్ఞకు విషెస్ రావడం నిజంగానే షాకింగ్ విషయం అని చెప్పాలి. ఈ క్రమంలో ప్రస్తుతం మెగా హీరో సాయిదుర్గాతేజ్ పోస్ట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది.