నేను చనిపోతే కొందరైనా నా కోసం ఈ పని చేయాలి.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్..!

మొదటినుంచి నందమూరి ఫ్యామిలీ.. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. వారి ఫ్యామిలీ ఆదరణ కోసం తారక్‌ మొదటి నుంచి అన్ని విషయాలను తగ్గుతున్నారు. తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా ఆయనకు, ఆయన అన్న కళ్యాణ్రామ్ కు ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పోస్టర్ మేకర్స్‌ రిలీజ్ చేసిన‌ వెంటనే మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. సినిమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తారక్, కళ్యాణ్ రామ్ ఇద్దరు తమ్ముడికి బర్త్డే విషెస్ తెలియజేశారు. ఇలా ఇంత ప్రేమగా వారి పట్ల వ్యవహరిస్తున్నా.. నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతున్నానన్నారు. ఇలాంటి క్రమంలో గతంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న సందర్భంలో.. గ‌తంలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Watch Temper Movie Online | Buy Rent Temper On BMS Stream

నేను చనిపోతే నాకోసం కొంతమంది అయినా ఆ పని చేయాలంటూ ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎన్టీఆర్ ఏం మాట్లాడారు.. చావు గురించి ఆయన నోటి నుంచి అసలు ఎందుకు మాటలు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. ఎన్టీఆర్ గతంలో వరుస ఫ్లాప్‌లతో సతమతమైన సంగతి తెలిసిందే. ఆ టైంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన టెంపర్ మూవీ ఆయనకు గ్రేట్ కమ్‌ బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే మైల్డ్‌ స్టోన్‌గా నిలిచిపోయింది. కాగా ఈ సినిమా షూట్ ముందు కథ‌ రెడీ చేసిన వ‌క్కంతం వంశీ.. ఇప్పటికే రెండు ఫ్లాప్‌లు వచ్చాయి. ఈ సినిమా ప్లాప్ అయితే మీకు చాలా కష్టం అవుతుంది. మీరు హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా మారిపోతారు. మరి మీ నిర్ణయం ఏంటి అని ఎన్టీఆర్ను అడిగారట. ఎన్టీఆర్ నాకు టెంపర్ కదా చాలా నచ్చింది. మంచివాడు.. చెడ్డవాడిగా మారితే ఎవరూ గుర్తించరు. కానీ.. ఓ చెడ్డవాడు, మంచివాడు అయితే అందరూ నెత్తిన పెట్టుకుంటారు.

NTR Speech At Mahanati Audio Launch

వాడు చనిపోయిన కూడా దేవుడిగా భావిస్తారు. నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే. నాకు ఈ సినిమా కరెక్ట్ అనిపించింది. అందుకే ఈ స్టోరీ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చా వంశీతో.. ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడట. నిజ జీవితంలో కూడా ఒకవేళ నేను చనిపోయినా.. కేవలం నా కుటుంబం, బంధువులే కాదు.. బయట కూడా కొంతమంది నా కోసం బాధపడేలా ఉండాలని అనుకుంటా. ఓ మంచి వాడు చనిపోయాడు అని వారు అనుకునేలా జీవించాలన్నదే నా సిద్ధాంతం. అలాంటి పేరు నేను సంపాదించుకోగలగాలి. నేను చనిపోయినప్పుడు నా కుటుంబం కాకుండా నా కోసం బయటి వారు కొంతమంది అయినా బాధపడాలి. అది నేను నిర్వర్తించాలనుకుంటున్న సిద్ధాంతం అంటూ ఎన్టీఆర్.. వక్కంతా వంశి దగ్గర ఎమోషనల్ అయ్యారట. ప్రస్తుతం గతంలో ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ మరోసారి నెటింట వైరల్‌గా మారుతున్నాయి.