మహేష్ కంటే ముందు రాజమౌళి ఈ సినిమాను మ‌రో స్టార్ హీరోతో చేయాలనుకున్నాడా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లక్‌ ఎలా ఉంటుందో.. ఎవరు ఎలాంటి సక్సెస్ సాధించి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో ఎవరూ చెప్పలేరు. తమదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కించి రికార్డులు సృష్టించడం మంచి ఇమేజ్‌ సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి క్రమంలో దర్శకులు తమ వైవిధ్యమైన శైలితో సినిమాలను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుని దూసుకుపోతూ ఉంటారు. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. ఇప్పటికి 25 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్న జక్కన్న.. తన సినీ కెరీర్ లో ఓటమి తెలియకుండా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం జక్కన్న.. మహేష్ బాబుతో పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu (@urstrulymahesh) • Instagram photos and videos

ఈ క్రమంలో సినిమా సెట్స్‌ పై కైనా రాకముందే.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదట ఈ సినిమాను రాంచరణ్‌తో చేయాల్సి ఉందట. కానీ బ్యాక్ టు బ్యాక్ రామ్ చరణ్ తో సినిమా చేయడం ఇష్టంలేని రాజమౌళి.. సినిమాను మహేష్ బాబుతో తీయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి రామ్ చరణ్‌తో ఇప్పటికే జక్కన్న రెండు సినిమాలను తెరకెక్కించారు. వీరి కాంబోలో తెరకెక్కిన మొదటి సినిమా మగధీర కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Ram Charan's driver becomes the talking point | cinejosh.com

ఇలాంటి క్రమంలో రాజమౌళి చేస్తున్న ఈ సినిమా విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాను మార్పులు చేర్పులతో తెరకెక్కించాలని.. కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. విజయేంద్రప్రసాద్ స్టోరీ అందించడం అంటే ఆ కథ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన అందించిన కథలన్నీ పాన్ వరల్డ్ రేంజ్ లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక రాజమౌళి సినిమాతో మరోసారి సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి సినిమా సెట్స్ పైకి వచ్చి షూట్ పూర్తయిన తర్వాత ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో.

S.S. Rajamouli Biography