సింహం ‘ పేరు కలిసొచ్చేలా బాలయ్య నటించిన సినిమాల లిస్ట్ ఇదే.. !

టాలీవుడ్ నందమూరి నఠ‌సింహం బాలకృష్ణ వరుస హైట్రిక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్ళ‌క్ష‌ తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్బికే 109 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకను గ్రాండ్ లెవెల్లో జరిగాయి. అ క్ర‌మంలో బాల‌య్య‌కు సంబంధించిన ఎన్నో వార్తలు నెటింట తెగ వైరల్‌గా మారాయి. అలా బాలయ్య సింహం పేరు కలిసి వచ్చేలా ఏకంగా తొమ్మిది సినిమాల్లో నటించాడు అంటూ ఓ వార్త తెగ చక్క‌ర్లు కొడుతుంది. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

సింహాం నవ్వింది (1983) | సింహాం నవ్వింది Movie | సింహాం నవ్వింది Telugu  Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat

సింహం నవ్వింది:
బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించిన సినిమాల్లో.. సింహం నవ్వింది కూడా ఒకటి. 1987లో ఈ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది.

Bobbili Simham (1994) — The Movie Database (TMDB)

బొబ్బిలి సింహం:
బాలయ్య హీరోగా.. రోజా, మీనా హీరోయిన్లుగా నటించిన మూవీ బొబ్బిలి సింహం. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 1994లో రిలీజ్ అయింది.

Samarasimha Reddy: బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహారెడ్డి మిస్ చేసుకున్న  హీరో ఎవరో తెలుసా.. - Telugu News | Do you know who is the missing hero of  Balakrishna blockbuster movie ...

సమరసింహారెడ్డి
బాలకృష్ణ, అంజలి జవేరి, సిమ్రాన్, సంఘవి కీలక పాత్రలో నటించిన సమరసింహారెడ్డి సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1999లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది.

రేపు బాలకృష్ణ 'నరసింహనాయుడు' రీ రిలీజ్

నరసింహనాయుడు:
సింహం పేరు కలిసొచ్చేలా బాలయ్య నటించిన నాలుగ‌వ‌ మూవీ నరసింహనాయుడు. 2001లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Watch Seema Simham (Telugu) Full Movie Online | Sun NXT

సీమ సింహం
బాలకృష్ణ హీరోగా 2002లో సీమ సింహం మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా అప్ప‌ట్లో మంచి టాక్ సంపాదించుకుంది.

Watch Laxmi Narasimha Full movie Online In HD | Find where to watch it  online on Justdial

లక్ష్మీ నరసింహ:
బాలయ్య హీరోగా ఆశిన్‌ హీరోయిన్గా.. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించిన మూవీ లక్ష్మీనరసింహ. ఈ సినిమా 2004లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Simha (2010) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

సింహ
బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా నమిత, నయనతార కీలక పాత్రలో నటించిన మూవీ సింహ. ఈ సినిమా 2010లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

Jai Simha (2018) — The Movie Database (TMDB)

జయసింహ
2018 జనవరి 12న రిలీజ్ అయిన జై సింహా సినిమాలోని నయనతారనే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించాడు.

వీర సింహా రెడ్డి (2023) | వీర సింహా రెడ్డి Movie | వీర సింహా రెడ్డి Telugu  Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat

వీర సింహారెడ్డి
ఇక గతేడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో వీర సింహారెడ్డి ఒకటి. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటించారు. గోపీచంద్ మల్లినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలా బాలయ్య ఇప్ప‌టివ‌ర‌కు సింహం పేరు కలిసి వచ్చేలా ఏకంగా తొమ్మిది సినిమాల్లో నటించాడు.