ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలతో పనిచేయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో ఉరి మూవీ తో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిం ఒకటి తెకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి ఎమ్మార్టెల్ అశ్వద్ధామ టైటిల్ తో ప్రాజెక్ట్ కూడా అనైన్స్ చేశాడు. రోని స్క్రూవాల్ నిర్మాతగా సారా అలీ ఖాన్, వికీకౌశల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో సెలెక్ట్ అయ్యారు. కాగా తర్వాత ఫ్యామిలీ మ్యాన్2 తో భారీ పాపులారిటీ దక్కించుకున్న సమంతను సారా ప్లేసులో రీప్లేస్ చేశారు మేకర్స్.
అయితే మధ్యలో కోవిడ్ రావడం.. బడ్జెట్ పెరిగిపోవడంతో ఈ ప్రాజెక్టును చేయలేని నిర్మాత దానిని పక్కన పెట్టేశారు. తర్వాత జి స్టూడియోస్ ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అయితే రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాకు విక్కీకౌశల్ కాకుండా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు అయితే బెటర్ అని జూనియర్ ఎన్టీఆర్, యష్ ఈ సినిమాలో సెలెక్ట్ చేసుకోవాలని వారిని అప్రోచ్ అయ్యారట మేకర్స్ కాగా యష్ వెంటన్ దానిని రిజెక్ట్ చేశాడు. ఎన్టీఆర్ మాత్రం స్క్రిప్ట్ విన్న తర్వాత సందేహాలతో ఏ విషయం తేల్చకుండా టైం వేస్ట్ చేశాడట. ఇక చాలాకాలం వెయిట్ చేసిన మేకర్స్.. తర్వాత రణ్‌వీర్ సింగ్‌ను అప్రోచ్ అయ్యారు.
అయితే రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ పై సరిగ్గా పనిచేయలేకపోయాడు. దీంతో జి స్టూడియో సంస్థ కుడా ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. అయితే ఎంతో మందిని అప్రోచై ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహించడంతో దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు వృధా అయినట్లు సమాచారం. ఇప్పటికీ ఆపకపోతే ఇంకెంత నష్టం జరుగుతుందో అనే ఉద్దేశంతో మేకర్స్ ఆ ప్రాజెక్ట్‌కు చెక్ పెట్టారట. ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. లేదా నో చెప్పేయడం.. జరిగి ఉంటే కాస్త సమయం కలిసి వచ్చేదని అప్పటికే రణ్‌వీర్ సింగ్ డేట్స్ ఖాళీ ఉండి సినిమాను పూర్తి చేసేవాడు అంటూ సమాచారం. అలా తారక్ కారణంగా జీ స్టూడియోస్‌కు మొత్తం రూ.30 కోట్ల లాస్ వచ్చిందట.