నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర పార్ట్ 1 ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సినీప్రియలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే త్వరలో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు దేవర ట్రైలర్ లాంచ్ కు సిద్ధమయ్యారు టీం. ఇక ఈ ట్రైలర్ లంచ్ ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం తారక్ ముంబైలో ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ను కటిశారు.
వీళ్ళిద్దరు కలిసి ముచ్చటించుకుంటున్న ఓ ఫోటో నెటింట తెగ వైరల్ గా మారడంతో ప్రస్తుతం ఈ పిక్ నెటింట చర్చనీయ అంశంగా మారింది. వీరిద్దరి కాంబోలో త్వరలోనే ఓ సినిమా రాబోతుందంటూ కొంతమంది చర్చించుకుంటుంటే.. మరి కొంత మంది మాత్రం ఇప్పట్లో వీరిద్దరికి కాంబోలో సినిమా వచ్చే అవకాశం లేదు.. ఇద్దరు సినిమాల లైనప్ ఫుల్ గా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో వీరి కాంబోలో సినిమా రావడం అసాధ్యం అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. వీరిద్దరూ నార్మల్‌గానే కలసి ముచ్చటించుకున్నారట. అంతేకానీ వీరి కాంబోలో ఎలాంటి సినిమా రావడం లేదని టాక్.
ఇక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న దేవరలో అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ప్రకాష్‌రాజ్, షైన్ టామ్ చాక్, శ్రీకాంత్, మురళి శర్మ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించడం సినిమాపై మరింత హైప్ పెంచుతుంది. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మొదట ట్రోల్స్ ని ఎదుర్కొన్న.. తర్వాత విపరీతమైన వ్యూస్‌తో టాప్ ప్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ దేవర నుంచి వచ్చే ట్రైలర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఏకంగా రూ.100 నుంచి 150 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.