నందమూరి ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. భారీ అంచనాలతో ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు పాటలు నెటింట రికార్డ్ సృష్టించాయి. అయితే తాజాగా దెవర మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటికే వారం రోజుల క్రితమే.. ఓవర్సిస్‌లో దేవర ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్.
దీంతో టికెట్స్ అతి తక్కువ సమయంలోనే హార్ట్ కేకులాగా అమ్ముడుపోతున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపట్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇలాంటి క్రమంలో కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్.. బుకింగ్స్తో మిలియన్ డాలర్ మార్క్‌ను దాటేసింది. దీంతో నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్లు అమ్ముడుపోయి.. వన్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమాగా దేవర నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఈ రేంజ్‌లో బుకింగ్స్ కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా దేవర రికార్డ్ సృష్టించింది.
దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల్లో హైప్ తీసుకొస్తే సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో దేవర ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ముగ్గురు వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో జాన్వి.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత సముద్ర నేపథ్య కథగా సినిమాను తెరకెక్కించాడు కొరటాల శివ. రెండు భాగాలుగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.