ఆ సినిమా కోసం రజనీకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీదేవి .. ఆ మూవీ ఏంటంటే..?

దివంగత స్టార్‌బ్యూటీ.. అతిలోక‌సుంద‌రి శ్రీదేవికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. భారతదేశంలోనే తొలి మహిళా సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈమె హీరోయిన్గా నటిస్తున్న కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న భార‌తీయ నటిగా మొదటి వరుసలో ఉండేది. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ముద్దుగుమ్మ.. కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భోనికపూర్‌ను వివాహం చేసుకొని అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది.

ఈ అమ్మడికి జాన్వి కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక‌ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీదేవి.. కోనేళ్ళ‌కు రీఎంట్రీ ఇచ్చి మళ్లీ అదే క్రేజ్‌తో దూసుకుపోయింది. కాగా బంధువుల ఇంటికి వివాహానికి వెళ్ళిన ఈ అమ్మడు.. ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇండస్ట్రీతో పాటు.. కోట్లాదిమంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణించినా ఇప్పటికీ కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ప్రస్తుతం శ్రీదేవికి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అదేంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్లు లక్షల్లో కోట్లల్లో ఉంటున్నాయి. కానీ 1970ల కాలంలో మాత్రం కేవలం రెమ్యూనరేషన్ వేలల్లో ఉండేది. ఆ సమయంలో శ్రీదేవి ఓ సినిమాకు రజనీకాంత్ కంటే కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుందట.

రజనీకాంత్‌, కమలహాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మూండ్రు ముడ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. కే.బాలచందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే సినిమాకి కమల్ హాసన్ రూ. 30 వేల‌ రెమ్యూనరేషన్ అందుకోగా.. రజనీకాంత్ రూ.2వేలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక శ్రీదేవి కూడా రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుందట. ఆమె ఈ సినిమాకు రూ.5 వేలు ఛార్జ్ చేసింద‌ని సమాచారం. అప్పట్లో కమల్ హాసన్ పేరున నటుడు కనుక వారి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఆయనకు దక్కింది. ఇప్పుడు రజనీకాంత్, కమలహాసన్ భారతదేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా తమ సత్తా చాటుతున్నారు. తమ నటించే సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లో అందుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నారు.