సైలెంట్ షాక్ ఇచ్చిన బోయపాటి శ్రీను.. మాస్ డైరెక్టర్ అనిపించాడుగా..!!

నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2. అఫ్కోర్స్ బాలయ్యలోని మాస్ యాంగిల్స్ ని బోయపాటి శ్రీను చాలాసార్లు బయటపెట్టాడు. కానీ బాలయ్య లోని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ని బయటపెట్టిన సినిమా మాత్రం అఖండ అని చెప్పక తప్పదు . మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా అఖండ.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కరోనా మూమెంట్లో థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేయడానికి భయపడిపోతున్న మేకర్స్ కు బాలయ్య వెన్నుగా నిలిచి ఈ సినిమాను ధైర్యంగా రిలీజ్ చేశారు . ఈ సినిమా ఏకంగా 100 కోట్లు క్రాస్ చేసింది . అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా కాదు . కాగా అఖండ 2 పై అభిమానులు హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఎప్పుడెప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తుందా ..? అంటూ వెయిట్ చేస్తున్నారు .

ఇన్నాళ్లు రాజకీయాలలో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్స్లో పాల్గొనబోతున్నాడు . ఆ వెంటనే బాలయ్య అఖండ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట . బోయపాటి శ్రీను కూడా దీనికి సంబంధించి అన్ని పనులను పూర్తి చేసుకున్నారట. అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమా కోసం కెరియర్ లో ఫస్ట్ టైం బాలయ్య 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారట . దీంతో ఈ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతుంది. నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు . బాలయ్య ఊర మాస్ రేంజ్ అంటే ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు..!!