అప్పుడు క్యూట్ లుక్‌లో.. ఇప్పుడు అంతకన్నా స్వీట్ లుక్ లో.. ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ నటీ నటులు చిన్ననాటి ఫొటోస్ నిటింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని ఎలాగైనా సంపాదించి వైరల్ చేయాలని వారి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను చూడాలని ఆశపడుతున్నారు. అలాగే వాటిని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు అదే విధంగా త్రో బ్యాక్ థీంతో ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింటి తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా. ప్రస్తుతం టాలీవుడ్ లోనే క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతుంది. తెలుగులో చేసింది రెండు సినిమాల్లో అయినా తన రెండు సినిమాలతో సూపర్ హిట్ సక్సెస్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేస్తుంది.

Mrunal Thakur: 'No point living life in regret, yaar' - Rediff.com

ప్రస్తుతం ఆమెకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు కుర్రోళ్ళ గుండెలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ వాళ్ళ క్రష్ గా మారిపోయింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా. ఆమె స్వీట్ బ్యూటీ మృణాల్ ఠాగూర్. చూడడానికి అచ్చు తెలుగు ఆడపిల్లల అద్భుతమైన స్మైల్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మ మంబాయి చిన్న‌ది. మొదట హిందీలో పలు సీరియల్స్ లో నటించింది. కుంకుమ భాగ్య సీరియల్ తో ఈమె ప్రేక్షకులకు పరిచయమై.. విట్టిదండు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

Stunning Looks Of Mrunal Thakur

తర్వాత తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగింటి ఆడపడుచుల సాంప్రదాయమైన కట్టుబొట్టు, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో సీతగా, ప్రిన్స్ నూర్జహాన్‌గా రెండు పాత్రలోనూ మెప్పించింది. కోట్లాదిమంది హృదయాలకు హత్తుకునే నటనతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న‌ సినిమాలో నటించింది. ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈమె స్టార్ హీరోయిన్గా పాపులర్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఈ ఏడది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది.