“డబ్బులు కోసం అలాంటి పనులు చేశా”.. నిజం ఒప్పేసుకున్న యంగ్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వెల్ బ్యాక్ గ్రౌండ్ సెటిల్ ఉండదు. కొందరు అసలు ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు . అలాంటి వాళ్ళు స్టార్ హీరోయిన్స్ గా మారడం చాలా చాలా రేర్. మరి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోతే ఆ లక్కే వేరు . ప్రెసెంట్ అదే లిస్టులో ఉంది వైష్ణవి చైతన్య . యూట్యూబర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

ప్రజెంట్ ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. నాలుగు కూడా సూపర్ డూపర్ హిట్ మూవీస్ కావడం గమనార్హం. అయితే వైష్ణవి చైతన్య కెరియర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది . మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ గా ఎన్నో తిప్పలు కూడా పడింది. “డబ్బుల కోసం నైట్ బర్త్ డే పార్టీలకు వెళ్లి డాన్స్ చేసే దాన్ని అని .. దానికి వచ్చిన డబ్బులతో మా అమ్మ ఇంట్లో సరుకులు కొనేది అని అప్పుడు.. మా ఆకలి తీరేది అని చెప్పుకొచ్చింది “.

అంతేకాదు . యూట్యూబ్ వీడియోలు చేయడానికి కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారేది అని.. ఆ టైంలో వాష్ రూమ్ లోకి వెళ్లి డ్రస్సులు మార్చుకునేదాన్ని.. అది చూసి మా అమ్మ చాలాసార్లు ఏడ్చిందని చెప్పుకొచ్చింది . ఫైనల్లీ ఇప్పుడిప్పుడే లైఫ్ లో సెటిల్ అవుతున్నాము అని .. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తన వంతు కృషి చేస్తాను అని చెప్పుకొచ్చింది.