సమంత పై సిద్ధార్ధ్ రొమాంటిక్ కామెంట్స్ విన్నారా..? ఎంత ధైర్యం రా బాబు నీకు..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్ . ఏదైనా సినిమా షూట్ చేస్తున్న టైం లోనే ప్రేమలో పడడం .. ఆ తర్వాత విచ్చలవిడిగా తిరిగేయడం అన్ని బాగుంటే పెళ్లి చేసుకోవడం ..లేదంటే టాటా బై బై చెప్పేసుకోవడం సర్వసాధారణం . ఆ లిస్టులో చాలామంది వస్తారు . అదే లిస్టులోకి వస్తారు సిద్ధార్ధ్.. వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా దూరంగా ఉన్నారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్ధ్.. సమంతపై చేసిన పాజిటివ్ కామెంట్స్ మళ్ళీ వాళ్ళు కలవబోతున్నారు అన్న ఆశలు పుట్టించింది .

యాంకర్ వచ్చే సిద్ధార్ధ్ ను “మిస్ బ్యూటిఫుల్ ఎవరు ..?” అని అడగ్గా వెంటనే ఏమీ ఆలోచించకుండా “సమంత” అంటూ చెప్పేస్తాడు. ఆ తర్వాత “మిస్ పర్ఫెక్ట్ ఎవరు..?” అని అడగ్గా మళ్లీ సమంత అని చెప్తాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు సమంత పేరును సిద్ధార్ధ్ చెప్పడంతో పైగా అది పాజిటివ్గా చెప్పడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

బహుశా వీళ్లిద్దరు మళ్ళీ కలవబోతున్నారేమో..? నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సింగిల్ గానే ఉంది . సిద్దు ప్రజెంట్ అతిథి రావు హైదరితో డేటింగ్ లో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళనే వదిలేసిన సిద్దుకు డేటింగ్ ఒక లెక్క అంటున్నారు జనాలు. కొందరు మాత్రం సిద్దు చాలా పాజిటివ్గా ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకుని కామెంట్స్ చేశారు అని ..మీరు రాద్ధాంతాలు చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . సమంతపై సిద్ధార్ధ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి..!!