ఎన్టీఆర్ న‌టించిన అన్ని సినిమాలలో తల్లి శాలినికి ఆ మూవీ అంటే అంత ఇష్టమా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం బిజీ లైనప్‌తో వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తారక్.. మొదట చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే.. వరుస సక్సెస్లను అందుకని స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నటన, డ్యాన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ యంగ్ టైగర్ బిరుదును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించగా ఆయన తల్లి శాలిని గారికి మాత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమా అంటే చాలా ఇష్టమట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఎందుకు ఆ సినిమా అంటే ఆవిడకు అంత ఇష్టమో ఒకసారి తెలుసుకుందాం.

Temper (2015) - IMDb

ఎన్టీఆర్ హీరోగా నటించిన అన్ని సినిమాలలోనూ టెంపర్ సినిమా అంటే ఎన్టీఆర్ తల్లి శాలినికి చాలా ఇష్టమట. దాంట్లో ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి ఎన్టీఆర్ చేసే పోరాటం.. చివర్లో నేరం చేసిన వాళ్లు తప్పించుకోకుండా ఉండాలని బాధతో ఆయన చెప్పే డైలాగ్స్.. ఆ మాడ్యులేషన్ కానీ తార‌క్ న‌ట‌న ఆమెకు చాలా బాగా నచ్చిందట. ఈ విషయాన్ని ఎన్నోసార్లు తన సన్నిహితులకు చెబుతూ ఉంటుందట. సినిమాలు చూసే కాళీ దొరికినప్పుడల్లా మొదటి ఎన్టీఆర్ టెంపర్ సినిమా చూడడానికి ఆమె ఆసక్తి చూపుతారట. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుందంటూ తారక్‌కి స్వయంగా ఆమె ఎన్నోసార్లు వివరించిందట. ఇక ఆయన నటించిన సినిమాలనింటిటో టెంపర్ సినిమాలో తారక్ నటన చాలా డెప్త్ గా అనిపిస్తుంది.

Devara new update out! Jr NTR resumes shoot of Koratala Siva's film - India  Today

ఈ సినిమా చాలామంది ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక‌ ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల డైరెక్షన్‌లో దేవర సినిమాలో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే ఎన్టీఆర్ మార్కెట్ పాన్ ఇండియా లెవెల్‌లో మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాతో పాటే వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టార‌ర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో మరో సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన బోతున్నాడు. ఇక ప్రస్తుతం తార‌క్ నటిస్తున్న దేవర రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానుంది. ఈ మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా చాటుకోవాలని ఎన్టీఆర్ కసిగా పనిచేస్తున్నాడు. ఈ సినిమాతో తారక్‌ ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడ‌తాడంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.