యంగ్ హీరో శర్వానంద్ ఆ ఇండస్ట్రియల్ హిట్ వదులుకున్నాడా.. అది చేసి ఉంటే స్టార్ హీరో అయ్యే వాడు..

టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్ టైర్ 2 హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. అయితే శర్వానంద్ గతంలో ఓ బ్లాక్‌ బాస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడని.. ఆ సినిమా చేసి ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోల లిస్టులో శర్వానంద్ పేరు కూడా ఉండేది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే శర్వానంద్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయింది. గత ఏడాది వైవాహిక జీవితానికి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో.. తాజాగా ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చిపేరింటింగ్ లైఫ్ కి కూడా స్వాగతం పలికాడు. ఈ న్యూస్ ఆయన అభిమానులతో ఇటీవల షేర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Sharwanand Welcomes Baby Girl Leela With Wife Rakshita Reddy, Shares Pics  On Instagram

ఇక ఇటు సినిమాల పరంగాను, అటు ఫ్యామిలీ పరంగాను ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న శర్వానంద్.. 2003లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పటినుంచి ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఈయన.. మొదటినుంచి ఫ్యామిలీ మొత్తం చూడగలిగే సినిమాలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తూ ఆ సినిమాల్లో నటించాడు. అలాగే కొన్ని లవ్ స్టోరీస్‌తోను యూత్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే శర్వానంద్ ఇండస్ట్రియల్ హిట్ సినిమాని వదులుకోవడంతో ఆయన లక్ కాస్త తప్పిందని చెప్పాలి. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో మొదట శ‌ర్వానంద్‌కు న‌టించే అవకాశం వచ్చిందట. కానీ అప్పట్లో ఏవో కారణాలతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట శర్వానంద్. దీంతో విజయ్‌కి ఈ సినిమాలో అవకాశం ద‌క్కింది. ఇక సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్ ఎలాంటి మలుపు తిరిగిందో అందరికీ తెలుసు.

100+] Arjun Reddy Wallpapers | Wallpapers.com

ఈ మూవీ తర్వాత హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వారుస‌ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు విజ‌య్. అయితే అప్పుడే ఆ సినిమాను శ‌ర్వానంద్‌ చేసి ఉంటే మాత్రం ఇప్పుడు శర్వానంద్ రేంజ్ వేరే లెవెల్ లో ఉండేదని.. ఇండస్ట్రీలో లెక్కలన్నీ మార్చేసి స్టార్ హీరోల లిస్టులో దూసుకుపోయేవాడు అంటూ తెలుస్తుంది. అయితే ఆయన చివరిగా ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితాలాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం శ‌ర్వ తన 35 వ‌ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక హేషం వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది.