ఈ ఒక్క జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా వేజ్,నాన్ వెజ్లలో ఎక్కువగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కొత్తిమీర జూష్ తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎలా తిన్నా సరే మేలు చేస్తుందట. రోజువారి ఆహారంలో దీనిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి చక్కటి ఔషధం అని చెప్పవచ్చు.

కొత్తిమీరను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, క్యాల్షియం, విటమిన్-C, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. అయితే ఇప్పుడు కొత్తిమీర జ్యూస్ ని తాగడం వల్ల మన శరీరానికి ఉపయోగపడే వాటి గురించి తెలుసుకుందాం.

1). అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతిరోజు కొత్తిమీర నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. ప్రతిరోజు కొత్తిమీర నీటిని రెండుసార్లు తాగాలి.

2). కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు కొత్తిమీర నీటిని తాగడం వల్ల కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆసిడిటీ సమస్య ఉన్నవారు కూడా కొత్తిమీర జ్యూస్ లోకి జీలకర్ర పంచదార వేసి ఉడికించి ఆ నీటిని తాగడం వల్ల వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

3). షుగర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా పనిచేసి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందట.

4).కళ్ళ మంటలు కళ్ళల్లో నీరు కారడం వంటి సమస్యలు ఉన్నవారు కొత్తిమీర గింజలను బాగా నూరి నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చిన తర్వాత కళ్ళల్లో రెండు చుక్కలు వేసుకుంటే చాలా మంచిది.

5). పీరియడ్స్ రానివారు కొత్తిమీర నీళ్లలో కాస్త పంచదార కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుందట.