బాలయ్యను దేవుడు అంటూ పొగిడేసిన ఆ కామెడియ‌న్‌…!!

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ” భగవంత్ కేసరి ” సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి వరంగల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఇక ఈ ఈవెంట్లో నటుడు రచ్చ రవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవి మాట్లాడుతూ.. నేను వరంగల్లో ఉన్నా కూడా.. ఏనాడు రాజును చూడలేదు.. రాజు అంటే రాజ్యం. బలగం ఉండటం కాదు. రాజు అంటే అందరికీ ధైర్యం ఇచ్చేవాడు.

అలా మా ఇండస్ట్రీకి దర్శక, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ధైర్యం ఇస్తాడు మా బాలయ్య.. చిన్ని కృష్ణుడులా నవ్వుతూనే ఉంటాడు. కొట్టడు, తిట్టడు అని అంద‌రు అంటారు. కానీ ఎందుకు కొట్టడు.. ఎందుకు తిట్టడు అనేది ఆయనకు.. అవతలి వ్యక్తికి తెలుస్తుంది బాలయ్యను దేవుడు అంటూ రచ్చ రవి స్టేజ్ పై బాలయ్యని తెగ పొగిడేసాడు. ప్రస్తుతం రచ్చ రవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.