మహేష్ మూవీ కోసం జక్కన్న మార్కెటింగ్ స్ట్రాటజీ అదుర్స్..

ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు. ఇక రాజమౌళి ఇప్పటికే ఈ కథ స్క్రిప్ట్‌ తయారుచేశాడు సినిమాకు సంబంధించిన లొకేషన్ల కోసం మూవి టీమ్ సెర్చింగ్ మొదలయాయి. ఇక దీంతో పాటుగా రాజమౌళి సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ లను కూడా క్రియేట్ చేస్తున్నాడట. మహేష్ బాబుని ఈ సినిమాలో గైడ్ చేసే ఓ వ్యక్తి ఉంటాడు.

ఆ రోల్‌ కోసం బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోని ఈ సినిమాలో తీసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే మహేష్ బాబు తో పాటు సినిమా మొత్తం ఉండే కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్ల కోసం తమిళ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ తీసుకుంటున్నాడట. ఇక పాన్ వ‌రల్డ్‌ సినిమా కాబట్టి ఇందులో కీలక పాత్రల్లో నటించేందుకు హాలీవుడ్ నటులను కూడా కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

ఇలా చేస్తే మార్కెట్ పరంగా కూడా అన్ని ఇండస్ట్రీలకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని సినిమాకు బాగా కలిసి వస్తుందని రాజమౌళి డెసిషన్ తీసుకున్నాడట‌.ఇక గతంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో కూడా రాజమౌళి కొంతమంది హాలీవుడ్ నటులను తీసుకున్నాడు. రాజమౌళి ఏం చేసినా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారమే చేస్తాడనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు మార్కెట్ ను పెంచడానికి జక్కన్న ప్లాన్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.