శ్రీ‌లీల కార‌ణంగా కొడుకు చేత తిట్లు తిన్న బాల‌య్య‌.. తండ్రిని మోక్షజ్ఞ అంత మాట‌నేశాడా?

యంగ్ బ్యూటీ శ్రీ‌లీల కార‌ణంగా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ సొంత కొడుకు చేత తిట్లు తిన్నాడ‌ట‌. బాల‌య్య తాజాగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న బాల‌కృష్ణ త్వ‌ర‌లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది.

అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల ఇందులో బాల‌య్య కూతురిగా కీల‌క పాత్ర పోషించింది. ద‌సరా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న భ‌గ‌వంత్ కేస‌రి విడుద‌ల కాబోతోంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను షురూ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం వ‌రంగ‌ల్‌లో భ‌గ‌వంత్ కేస‌రి ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కింది.

అయితే ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో బాల‌య్య ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు. ఎప్ప‌టిలాగానే ఎనెర్జిటిక్ గా స్పీచ్ ఇచ్చారు. భ‌గ‌వంత్ కేస‌రి త‌న ఫ్యాన్స్ కి విందు భోజ‌నంలా ఉంటుంద‌ని.. దసరాకి ముందు తప్పకుండా దంచుదాం అని బాల‌య్య పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే శ్రీ‌లీల గురించి బాల‌య్య మాట్లాడుతూ.. షూటింగ్ జరిగిన‌న్ని రోజులు శ్రీలీల తనను చీచా అని పిలిచిందని, శ్రీలీలతో నెక్స్ట్ ఆమె హీరోయిన్ గా, నేను హీరోగా చేయాలని ఉందని చెబుతూ న‌వ్వించారు.

ఈ విషయం ఇంట్లో చెబితే మోక్షజ్ఞ త‌న‌ను ముఖంపైనే తిట్టాడ‌ని.. ఏం డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా.. నెక్స్ట్ కుర్ర హీరోని నేను వస్తున్నాను కదా అంటూ కోపడ్డాడని కూడా బాల‌య్య పేర్కొన్నాడు. దీంతో బాల‌య్య కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.