ఒక్క ఫైట్ సీన్ ఆ హీరో జీవితాని మార్చేసింది.. 30 ఏళ్లుగా ఆసుప‌త్రిలో..?

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓ విషాదం నెలకొంది. దాదాపు 30 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైన ఓ స్టార్ హీరో ఇటీవల కన్నుమూశాడు. షూటింగ్లో జరిగిన ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన ఈ తమిళ్ హీరో బాబు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. ప్రముఖ దర్శకులు భారతీయ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఇతను 1990లో వచ్చిన ఎన్ ఉయిర్ తోజన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు తమిళ ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు.

మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన తర్వాత పెరంపులి, తాయమ్మ, పొన్నుకు చేతి వంద‌చే సినిమాల్లో హీరోగా నటించాడు. పల్లెటూరి కథలు తనకు బాగా వర్కౌట్ అయ్యాయి.. మంచి ఫామ్ లో ఉన్న నేపథ్యంలో తన ఐదవ సినిమా మనసారా పరిహితంగానే సినిమాలో నటించాడు. ఈ సినిమానే బాబు జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. షూటింగ్ టైంలో జరిగిన ప్రమాదంతో తీవ్రగాయాలకు పాలయ్యాడు. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఓ ఫైట్ సీన్ రూపొందించారు. సన్నివేశంలో హీరో నేలపై నుంచి దూకాలి నిజంగానే జంపింగ్ చేస్తానని బాబు చెప్పడంతో యూనిట్ దానికి ఓకే చేశారు.

డూప్ పెట్టుకోవచ్చు కదా అని దర్శకుడు చెప్పిన వినకుండా రియలిస్టిక్‌గా ఉంటుందని బాబు నిజంగానే జంప్ చేసాడు. ఆ తర్వాత అనుకోకుండా బాబు ప్రమాదవశాత్తు మరోచోట పడిపోవడంతో వీపుపై బలంగా తగిలి ఎముకలు విరిగిపోయాయి.

వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకుంటుండగా బాబు నిటారుగా కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. అతని కుటుంబం చాలామంది వైద్యులను సంప్రదించిన ఉపయోగం లేకుండా పోయింది. ఈ ప్రమాదంతో అతని సినీ కెరీర్ ముగిసిపోయింది. దీని కారణంగా 30 ఏళ్లు గా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ఈయన మరణించడంతో తమిళ ప్రేక్షకులు సంతాపం తెలియజేశారు.