ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో జ‌య‌సుధ‌పై మోహ‌న్ బాబు ఫైర్‌.. అంత త‌ప్పు ఏం చేసింది?(వీడియో)

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఈ సంద‌ర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వ‌చ్చి.. ఆ మ‌హాన‌టుడి విగ్ర‌హాన్ని త‌న చేతుల మీద‌గా ఆవిష్క‌రించారు. అలాగే ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది.

ఏయన్నార్ విగ్రహావిష్కరణ వేడుక‌లో టాలీవుడ్ కి చెందిన ప‌లువురు న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాజ‌కీయ నాయకులు కూడా విచ్చేసి అక్కినేని గొప్పదనాన్ని వివరించారు. అయితే ఈ వేడుక‌ల్లో స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌పై క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఫైర్ అయ్యారు. ఆవిడి ఫోన్ ను లాక్కుంటూ క‌సుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

మోహ‌న్ బాబు అగ్ర‌హించేంత త‌ప్పు జ‌య‌సుధ ఏం చేశారు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. క్రమశిక్షణగా మోహ‌న్ బాబు మారుపేరు. ఆయ‌న ఎంత క్రమశిక్షణగా ఉంటారో.. త‌న చుట్టుపక్కల ఉండేవాళ్లు కూడా అలానే ఉండాలని భావిస్తుంటాడు. అయితే నేడు ఏయన్నార్ విగ్రహావిష్కరణ వేడుక‌కు వ‌చ్చిన వారంతా.. ఆయ‌న‌కు నివాళులర్పించారు. ఆపై కొంద‌రు ఏఎన్నార్ గారి ప్ర‌స‌గించారు. ఆ స‌మ‌యంలో జ‌య‌సుధ ఫోన్లో మునిగిపోయింది. దీంతో ప‌క్క‌నే కూర్చుని ఉన్న‌ మోహన్ బాబు సీరియస్ అయ్యారు. ఆ ఫోన్‌ను లాక్కుందామని మోహన్ బాబు ప్రయత్నించారు. కానీ, జయసుధ మాత్రం ఫోన్ ఇవ్వ‌కుండా నవ్వుతూనే కనిపించింది. ఇందుకు సంబంధించిన విజువ‌ల్స్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.