ఆ సీన్ చేయడం ఇష్టం లేక ..బిగ్ బ్లాక్ బస్టర్ మూవీని వదిలేసుకున్న ఎన్టీఆర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న కథలో మరో స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . అలా ఇప్పటికే చాలామంది హీరోస్ మంచి మంచి సినిమాలను మిస్ చేసుకున్నారు . అయితే ఆ సినిమా హిట్ అవుతుందని తెలిసిన తారక్ కొన్ని సీన్స్ నచ్చక కథను రిజెక్ట్ చేసిన సినిమా గురించి ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి . ఆ మూవీ మరేదో కాదు బిజినెస్మెన్ .

పోకిరి తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న నమ్మకంతో పూరి జగన్నాథ్ మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా బిజినెస్ మాన్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది . కాగ ఈ సినిమాని పూరి జగన్నాథ్ ముందుగా తారక్ కి వివరించారట. అయితే కధ అంతా బాగున్న కొన్ని బోల్డ్ డైలాగ్స్ బాగా లేవు అంటూ చెప్పుకొచ్చారట.

ఆ బోల్ డైలాగ్స్ తీసేయడానికి కూడా పూరి జగన్నాథ్ ఓకే చెప్పారట. అయినా సరే హీరోయిన్ తో లో ఓ సాంగ్లో హద్దులు మీరి ప్రవర్తించాల్సి వస్తుందని అలాంటి సీల్స్ నచ్చకే ఈ సినిమా నుండి తప్పుకుంటున్నానని ఓపెన్ గా చెప్పుకొచ్చారట ఎన్టీఆర్. దీంతో అప్పట్లో ఈ విషయం వైరల్ గా మారింది. ఆ తర్వాత ఆ రోల్ ని ఆ బోల్డ్ డైలాగ్స్ ని యాక్సెప్ట్ చేసి మరి మూవీలో నటించిన హిట్ కొట్టాడు మహేష్ బాబు . అప్పట్లో ఈ విషయం ఎంత ట్రెండింగ్ గా మారిందో మనకు తెలిసిందే . ప్రెసెంట్ తారక్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉంటే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు..!!