ఆ విషయంలో అభిమానుల హార్ట్ బ్రేక్ చేసిన అనుష్క .. డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే పండగ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకొని తనదైన స్టైల్ లో ముందుకు వెళుతున్న హీరోయిన్ అనుష్క శెట్టి అంటే జనాలకి మహా ఇష్టం. పేరుకి కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో సూపర్ సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేయించుకుని మరి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పోసిషన్ ఎంజాయ్ చేస్తున్న స్వీటీ తాజాగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి . మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు. ఫుల్ టు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది .

ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా కి క్లీన్ సూపర్ డూపర్ హిట్ గా ఉంది అంటూ స్టార్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో నవీన్ పోలిశెట్టి చురుగ్గా పాల్గొనడం సినిమాకి మరింత ప్లస్ అయింది . కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క శెట్టి మాట్లాడుతూ ..తన నెక్స్ట్ సినిమాలపై క్రేజీ అప్డేట్ రిలీజ్ చేసింది . “తాను సినిమాలు చేస్తానని .. కానీ ఈసారి మెసేజ్ ఓరియెంటెడ్ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కాకుండా కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అని ..తన ఫ్యాన్స్ కూడా తన వద్ద నుంచి అదే కోరుకుంటున్నారని చెప్పుకొచ్చింది”.

దీంతో సోషల్ మీడియాలో ఇదే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అయితే కొంతమంది అనుష్క శెట్టిను లేడీ ఓరియంటెడ్ ఫీలిం ల లో చూసి చూసి బోర్ కొట్టేస్తుందని ..అనుష్క మంచి నిర్ణయం తీసుకుందని అంటుంటే.. మరికొందరు మాత్రం అనుష్క అన్ని మిక్స్ చేసి సినిమాలు చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ బిందాస్ గా ఖుషి అవుతున్నారు . కమర్షియల్ సినిమాలు అంటే ప్రభాస్ తో కలిసి నటిస్తే మరో మిర్చి అవుతుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!