తమన్నాకు ఉన్న ఆ పాడు అలవాటే.. ఆమెను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యేలా చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకున్న మంచి అలవాటు కారణంగా చెడు అలవాట్లు కారణంగా కొన్నిసార్లు ప్లస్ అవ్వచ్చు కొన్నిసార్లు మైనస్ అవ్వచ్చు. మరీ ముఖ్యంగా మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ద్వారా మనకు ప్లస్ గా మారింది అంటే అది నిజంగా చాలా రేర్ కండిషన్స్ లోనే జరుగుతుందని చెప్పాలి . అలాగే తమన్నా లైఫ్ లోనే జరిగింది . తమన్నా ఎంత పట్టుదల ఉన్న వ్యక్తి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలా సినిమాలలో అది ప్రూవ్ చేసుకుంది .

కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటపరంగా కూడా మెప్పించింది . అయితే తమన్నాకు మొదటి నుంచి ఒక బ్యాడ్ హాబిట్ ఉందట . ఎవరు ఏదైనా సరే నువ్వు చేయలేవు అని అంటే అది కచ్చితంగా చేసి చూపిస్తుందట . అది ఎలాంటి పనైనా సరే ..నువ్వు ఆ హీరోతో రొమాన్స్ చేయలేవు అంటే కచ్చితంగా హీరోతో రొమాన్స్ చేసి శభాష్ అనిపించుకుంటుంది. అలాంటి స్టంట్ చేయలేవు అంటే ..ఆ స్టంట్ చేసి ప్రూవ్ చేసుకుంటుంది ..అలాగే తమన్నాను తన ఫ్రెండ్స్ నీవు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వెళ్లలేవు… ఇండస్ట్రీలో అందం ఉంటే సరిపోదు నటన కూడా ఉండాలి అంటూ అప్పుడు కామెంట్ చేసి ఏడిపించే వారట.

ఆ పట్టుదలతోనే తమన్నా రాత్రి పగలు కష్టపడి మోడలింగ్ చేసి ఎలాగోలా సినిమాలో అవకాశం దక్కించుకునింది . ఆ తర్వాత సినిమాలో వచ్చిన కొంచెం పేరుతో తన పేరుని మారుమ్రోగి పోయేలా చేసుకునింది . నిజానికి ఇది ఓ రకంగా బ్యాడ్ హాబిట్ అని చెప్పాలి.. ఒకరి కోసం మన లైఫ్ ని మార్చుకోవడం మంచి పద్ధతి కాదు. మన లైఫ్ మన ఇష్టం కానీ తమన్నా లైఫ్ లో ఒకరి కోసం తీసుకున్న నిర్ణయం ఆమెకు బాగానే కలిసి వచ్చింది. ఆమెను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యేలా చేసింది..!!