షారుక్ “జవాన్” హిట్ అవ్వడం కోసం మహేశ్ ఏం చేస్తున్నారో తెలుసా..? రియల్ అభిమానం అంటే ఇదే..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే మరో స్టార్ హీరో సపోర్ట్ చేయడం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలో అయితే అస్సలు ఒక హీరో మరో హీరోకి హెల్ప్ చేయరు . ఇప్పుడిప్పుడే ఆ పద్ధతులకు బ్రేక్ చెప్పి కొత్త సాంప్రదాయానికి తెర తీస్తున్నారు మన హీరోలు . ఒక స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మరో స్టార్ హీరో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం .

అయితే ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఏకంగా బాలీవుడ్ కింగ్ బాద్షా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన జవాన్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు . ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు “ఫస్ట్ టైం ఓ సినిమా రిలీజ్ కోసం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ ట్విట్ చేశారు”. ” షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా మరికొద్ది గంటలో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా చూడాలని నేను నా ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నాం. మీరు మీ కుటుంబంతో కలిసి సినిమా చూడండి “అంటూ ట్విట్ చేశారు .

కాగా ఈ ట్వీట్ కి షారుక్ రిప్లై ఇస్తూ..” నా సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది . మీరు ఏ థియేటర్లో సినిమా చూస్తున్నారో నాకు చెప్పండి .. నేను వచ్చి మీ ఫ్యామిలీతో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తాను” అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతే కాదు మొదటి నుంచి మహేష్ బాబు .. షారుక్ ఖాన్ కి బిగ్ ఫ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే . ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఆ ఉత్సాహం కుతూహలం ఇలాగే ఉంటుంది ఇదే రియల్ అభిమానం అంటే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!