మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి: అనుష్క రోల్ ని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి హీరోయిన్ ఈమె..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి .. లేటెస్ట్ గా హీరోయిన్గా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి . ఫుల్ టు ఫుల్ కామెడీ సినిమా ఇది. మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది . ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . మరీ ముఖ్యంగా అనుష్క ఈసారి ప్రత్యేక పాత్రలో కనిపిస్తూ ఉండడం అభిమానులకు చాలా ఎక్సైజ్ మెంట్ గా ఉంది . ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అనుష్క ని చూద్దామా ..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

నవీన్ పోలిశెట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమాలో నవ్వులు పూయాల్సిందే . అయితే ఈ సినిమాలో డైరెక్టర్ ముందుగా అనుష్క కంటే మరో హీరోయిన్ ని ఈరోల్ కి చూస్ చేసుకున్నారట . కానీ ఆ హీరోయిన్ ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలాంటి చీప్ పాత్రలో చేయలేను అంటూ సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక మందన్నా.

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. వద్దకే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కథ వెళ్ళిందట . కానీ అప్పటికే నేషనల్ క్రష్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలేస్తున్న రష్మిక ఇలాంటి పాత్రలో కనిపిస్తే అభిమానులు లైక్ చేయరని ..అది నెగిటివ్గా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసి ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్స్ ను అప్రోచ్ అవ్వగా ఫైనల్లీ అనుష్క సెట్ అయింది. ఏ మాటకు ఆ మాట ఈ రోల్ లో అనుష్కనే బాగా కనిపించింది అంటున్నారు అభిమానులు..!!