మరికొద్ది గంటల్లో జవాన్ సినిమా రిలీజ్.. షారుఖ్ చేసిన పనికి ఫ్యాన్స్ షాక్.. ఏంటి బ్రో ఇది..!!

కొన్ని నిమిషాలే కొన్ని అంటే ఇంకా కొన్ని నిమిషాలే.. బాలీవుడ్ బాద్షా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన జవాన్ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద షారుఖ్ ఖాన్ భారీ కటౌట్ ఫ్లెక్సీలతో అభిమానులు నానాహంగామ చేస్తున్నారు. భారీ భారీ పూలదండలు పాలాభిషేకాలతో రచ్చ రంబోలా చేస్తున్నారు . పఠాన్ సినిమాతో సినీ చరిత్రను తిరగరాసిన షారుక్ ఖాన్ ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీలో చెరగని రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసిన కొద్ది గంటల ముందు షారుక్ ఖాన్ ఎప్పుడూ లేని అల్లాకు నామాజ్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఎస్ నిజానికి షారుక్ ఖాన్ ఎప్పుడూ కూడా తన సినిమా రిలీజ్ అయ్యే టైంలో దేవుడిని ఈ సినిమా హిట్ చేయించు దేవుడా అంటూ కోరుకోడు . కానీ ఈ సినిమా విషయంలో మాత్రం తన రూల్స్ మొత్తం బ్రేక్ చేశారు . అంతేకాదు ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ తిరుమల కు వెళ్లిందే లేదు .

 

కానీ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు . అంతేకాదు ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని షారుక్ ఖాన్ ప్రత్యేక పూజలు కూడా చేయించారట . దీంతో ఫాన్స్ అయితే షారుఖ్ ఖాన్ ఈ సినిమా కోసం పడుతున్న తాపత్రయం చూసి షాక్ అయిపోతున్నారు . ఏంటి బ్రో ఇది అంత పెద్ద హీరోవి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!