నిమ్మ తొక్కను పడేస్తున్నారా…. ఇది తెలిస్తే నిమ్మకాయని వదిలేసి తోక్కనే వాడుతారు….!!

నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. నిమ్మకాయల్లో మాత్రమే కాదు నిమ్మ తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. తొక్కలో విటమిన్ సి తో పాటు క్యాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కను మనం పారేయకుండా జుట్టు, చర్మానికి ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీ పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఈ నిమ్మ తొక్కలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

• నిమ్మ తొక్కలతో చర్మంపై రుద్దుకుంటే మురికి చాలా వరకు పోతుంది. చర్మం నిగనిగలాడుతుంది.

• నిమ్మ తొక్కల పొడిని రెగ్యులర్గా వాడుతూ ఉంటే రక్త నాళాలలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తరువాత రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. నిమ్మ తొక్కల పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బిపిని కంట్రోల్ చేస్తుంది.

• ఇటీవల కాలంలో చాలా మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు. అందుకు కారణాల్లో ఒకటి కొలెస్ట్రాల్ అని నిపుణులు తెలిపారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో నిమ్మ తొక్క బాగా ఉపయోగపడుతుంది.

• కొంతమంది నుంచి తరచూ చెడి వాసనలు వస్తూ ఉంటాయి. అలాంటి వారి స్నానం చేసేముందు నిమ్మ తొక్కలతో చర్మంపై రుద్దుకుంటే స్నానం తర్వాత ఎటువంటి దుర్వాసన రాదు. అలాగే చర్మంపై ఉన్న బ్యాక్టీరియాల్ని కూడా తరిమేస్తుంది.

• ఇక ఈ తొక్కల వాసన పీలిస్తే మనలో టెన్షన్లు తగ్గుతాయి. నిరాశ లో ఉండేవారు నిమ్మ తొక్క వాసన చూడాలి. నిమ్మ తొక్క వాసన పీల్చినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది.