ఎట్టకేలకు సమంత- నాగచైతన్య విడిపోవడం వెనుక బయటపడ్డ షాకింగ్ నిజం..!!

టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన సమంత ,నాగచైతన్య దాదాపుగా ఐదేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ జంట విడిపోవడం జరిగింది. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏంటనే విషయం మాత్రం తెలియడం లేదు.. అంతేకాకుండా చాలామంది మొదట విడాకులు కావాలనుకున్నది చైతూనే అంటూ కామెంట్లు చేశారు. మరి కొంతమంది సమంత అంటూ కూడా ఇలా ఎన్నో రూమర్స్ సైతం సృష్టించారు.

Is this why Samantha, Naga Chaitanya's marriage is in troubles?

తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ ప్రకారం సమంత చైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి ఒక కారణం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సమంతనే విడాకులు కావాలని కోరిందట..పూర్తి వివరాల్లోకి వెళితే సమంత అమెరికాకి వెళ్లిన సమయంలో నాగచైతన్య తల్లిని కలిసేదట.. ఆ సమయంలో చైతన్యతో విడిపోవడానికి కారణాలు చెప్పినట్టు సమాచారం. పెళ్లి చేసుకున్న మొదట అంతా బాగానే ఉన్న రాను రాను చైతన్య సమంతను కంట్రోల్ చేయడానికి ప్రారంభించారని గ్లామర్ పాత్రలు అలాగే డ్రెస్సింగ్ విషయంలో ఫ్రెండ్స్ విషయంలో చివరికి మాట్లాడే పద్ధతిలో కూడా కంట్రోల్ చేయాలి అనుకున్నారట నాగచైతన్య.

ఈ విషయంతో వీరిద్దరి మధ్య చాలా సార్లు మనస్పర్ధలు గొడవలు కూడా జరిగాయట. అయినప్పటికీ నాగచైతన్య మాత్రం అసలు మారలేదని సమంత తన అత్తతో చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.చివరికి విసిగిపోయిన సమంత తన లైఫ్ను తాను బతకడం కోసం విడాకులు తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తాజాగా ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.