బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన బేబి హీరోయిన్ వైష్ణ‌వి… ఏకంగా ఆ స్టార్ హీరోకు జోడీగా…!

వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల్లోకి వచ్చిన ఈ సినిమా క్రేజీ కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టించింది. ఈ మూవీలో ఈ జనరేషన్ యువతి, యువకులు ఒకరి చేతిలో ఒకరు ఏ విధంగా మోసపోతున్నారు ఎలా నష్టపోతున్నారు అనే అంశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు డైరెక్ట‌ర్ సాయి రాజేష్‌. ఈ సినిమా కుర్ర కారుకు బాగా కనెక్ట్ అయింది.

ఈ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైన వైష్ణవి చైతన్యకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటనకు కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్న వైష్ణవి చైతన్య పేరే మారుమోగిపోతుంది. బేబీ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే క్రమంలో ఈ అమ్మడికి ఓ భారీ ఆఫర్ కూడా వచ్చిందట.

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కనున్న డెబ్బుల్‌ ఇస్మార్ట్ సినిమాలో వైష్ణవి చైతన్య ఓ హీరోయిన్గా నటించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే వైష్ణవికి ఈ సినిమా తరువాత ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. ఇప్పుడు ఈ అమ్మడు కథలు విషయంలో ఎలాంటి నియమాలు పాటిస్తుందో..? ఎటువంటి కథలు ఎంచుకుంటుందో..?చూడాలి. తను ఎంచుకునే కథలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని వైష్ణవి కూడా ఎంతో ట్రై చేస్తుందట. బేబీ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకుని మంచి మార్కులు కొట్టేసిన వైష్ణవి.. తన నెక్స్ట్ సినిమాతో ఎటువంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.