ప్ర‌భాస్ రాజు ఏం క్రేజు సామీ… అప్పుడే ‘ స‌లార్ ‘ బుకింగ్స్ మోత‌ ..!

పాన్‌ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా సలార్. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తర్కెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ పోస్టర్, టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి.

ఇక‌ సినిమాకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాపై మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూఎస్ బుకింగ్స్‌పై లేటెస్ట్ ఇన్ఫో తెలిసింది. మరి ఈ బుకింగ్ అయితే ఆగస్టు 3వ వారాంతం నుంచి స్టార్ట్ కానున్నట్లుగా సమాచారం. ఇక నెల ముందే సలార్ మెనియా స్టార్ట్ అవ్వబోతుందట.

రవి బసృర్‌ సంగీతం అందించిగా హోంబాలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ కి రోల్‌లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ రేంజ్ లో కలెక్షన్ లో అందుకుంటుందో చూడాలి.