సినీ పరిశ్రమ అంటే ఒక రంగుల ప్రపంచం. ఇందులో ఎంతోమంది నటీనటులు , డైరెక్టర్లు , నిర్మాతలు, టెక్నీషియన్స్ ఇలా ఎంతోమంది డ్రీమ్ సినిమా అని చెప్పవచ్చు.. సినిమా షూటింగ్ అంటే చాలా క్లిష్టమైనది అని చెప్పవచ్చు. ఎక్కువగా శ్రమతో కూడిన పని నటీనటుల ముందు నిలబడి కెమెరా ఆన్ చేసి షూట్ చేయడం అంటే సాధ్యమైనది కాదు.. సినిమా షూటింగుకు ఒక పద్ధతి ఉంటుంది. వాటిని పాటించాల్సి ఉండడమే కాకుండా పలు నియమాలు కూడా ఉంటాయట. అందులో క్లాప్ కొట్టడం కూడా ఒకటని తెలుస్తోంది.
ప్రతి ఒక్క సినిమా షూటింగ్లో సన్నివేశం చిత్రీకరించే ముందు కెమెరా ముందు లేదా నటీనటుల ముందు స్లిప్ లేదా క్లాప్ బోర్డ్ ను పెట్టి తీస్తూ ఉంటారు. అయితే అన్ని షూటింగ్ సమయాలలో క్లబ్ కొట్టడం మనం చూస్తూనే ఉంటాము. అయితే దీని ప్రాముఖ్యత మాత్రం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. క్లాప్ బోర్డు లేకుండా పూర్తి సినిమా షాట్ ను ఎడిట్ చేయడం చాలా కష్టమట. క్లాప్ బోర్డులో చిత్రీకరించబడిన సన్నివేశం.. తీయడం కెమెరా కోణం ఇలా అన్నీ కూడా ముఖ్యమైన సమాచారం ఉంటుందట.
మనం సినిమాలను చూసిన క్రమంలోనే సినిమా షూటింగ్ జరగదు. డైరెక్టర్ తన సౌకర్యం ప్రకారం సినిమా షూటింగ్ చేస్తూ ఉంటారు ఆపైన పలు విడివిడి సన్నివేశాలను కథకు అనుగుణంగా సవరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని క్లాప్ బోర్డ్ సమాచారం చాలా అవసరమవుతుందట. క్లాప్ బోర్డు పైన సినిమా పేరు, నిర్మాణ సంస్థ, డైరెక్టర్ పేరు, కెమెరా పేరు కూడా రాసి ఉంటుందట. దీంతోపాటు షాట్ ఏ నెలలో ప్రారంభిస్తారో నెల పేరు కూడా ఉంటుందట. అయితే ఒక్కసారి టేక్ సరిగ్గా జరగకపోతే స్లేట్ పై టేక్ నెంబర్ -1..తరచుగా 4 అని కూడా అలా రాస్తూనే ఉంటారట.. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ షాట్ కు వెళ్ళినప్పుడు షార్ట్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది. ఇలా సీన్ నెంబర్లు కూడా మారుతూ ఉంటాయి. ఇలా అన్నిటిని ఎడిటర్ దగ్గరకు పంపిస్తారు. క్లాప్ బోర్డు లోని సీన్ నంబర్లు చూడడం ద్వారా ఆ వీడియోలను కూడా క్రమంగా సెట్ చేసుకుంటూ ఉంటారు ఎడిటర్స్.
క్లాప్ బోర్డ్ ఎందుకు కొడతారు అంటే సినిమా షూటింగ్ సమయంలో సౌండ్ మరియు విజువల్స్ విడివిడిగా రికార్డు చేయబడతాయి. డైరెక్టర్ లైట్లు, కెమెరా సౌండ్, యాక్షన్ అంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో కెమెరా సౌండ్ కలిసి రికార్డ్ చేయడం ప్రారంభమవుతాయి.. ఒకవేళ సరైన సమయానికి కంప్యూటర్లో వాటిని ఒకేసారి సెట్ చేయకపోతే ముందు విజువల్ ఆ తర్వాత సౌండ్ వంటిది వస్తుంది. దీంతో సన్నివేశం ఆలస్యమవుతుంది కాబట్టే క్లాప్ బోర్డ్ ను కొడతారట.