సినీ పరిశ్రమలో అనేకమంది సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు స్వామి. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ జాతకం గురించి చెప్పారు. ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసాయి. ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి ఏం వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా నిలిచాడు. ఆ తర్వాత కూడా పాన్ ఇండియా స్థాయిలోని సినిమాలు చేస్తున్నాడు.
బాహుబలి తరువాత పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా వర్కవుట్ అవడం లేదు. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా పడ్డాడు. ఆ తరువాత రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్. ఆదిపురుష్ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చేస్తున్న అనేక సినిమాలు మీద ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి బాంబు పేల్చాడు.
వేణు స్వామి ప్రభాస్ జాతకంలో ఒక పాము ఉందని దాని కారణంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని…. కానీ ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురు చూస్తున్న తమ పెళ్లి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే ప్రభాస్ పెళ్లి ఆలస్యం అవుతుందని… ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా అనేక సమస్యలు ఎదురవుతాయని చెప్పుకొచ్చాడు. వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.