టీడీపీ వర్సెస్ వైసీపీ: ‘సోషల్’ పోరులో కొత్త లీడర్లు.!

నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఏ అంశమైన సోషల్ మీడియాతోనే ముడిపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలోనే రాజకీయాన్ని అంతా నడిపించే పరిస్తితి. ఇక పోరులో పైచేయి సాధించాలని పార్టీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఇక ఏపీలో ఈ సోషల్ మీడియా పోరులో వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంలో వైసీపీ సోషల్ మీడియా పాత్ర చాలా ఉంది.

ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..టీడీపీని దెబ్బకొట్టారు. దీంతో ఇప్పుడు టీడీపీ కూడా అలెర్ట్ అయ్యి పనిచేస్తుంది. రెండు పార్టీలు సోషల్ మీడియాలో హోరాహోరీగా ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల రెండు పార్టీల సోషల్ మీడియాలకు కొత్త లీడర్లు వచ్చారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు..భార్గవ్ రెడ్డిని పెట్టారు. భార్గవ్ ఆధ్వర్యంలోనే వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తుంది. ఇటు టీడీపీ సోషల్ మీడియా మాజీ మంత్రి అయ్యన్నపాత్రు తనయుడు విజయ్ నేతృత్వంలో నడుస్తున్న విషయం తెలిసిందే.

కానీ ఇటీవల విజయ్ టార్గెట్ గా వైసీపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. దీంతో విజయ్‌తో పాటు సోషల్ మీడియా బాధ్యతలని జీవీ రెడ్డికి కూడా అప్పగించారు. మంచి వక్తగా డిబేట్లలో టీడీపీ గళాన్ని వినిపించే జీవీ రెడ్డికి సైతం సోషల్ మీడియా బాధ్యతలు అప్పజెప్పారు. పైగా రెడ్డి సామాజికవర్గం నేత కావడంతో..వైసీపీకి ఈజీగా చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో రెండు పార్టీల సోషల్ మీడియాలు ఏ స్థాయిలో ప్రచారం చేస్తాయో.