చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అంటున్న డైరెక్టర్..!!

చిరంజీవి సినిమాలలో నటిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు మక్కువ చూపి సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే కొన్ని కారణాల చేత ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటి రోజున వాల్తేర్ వీరయ్య చిత్రంలోని ఈవెంట్లో ప్రముఖ డైరెక్టర్ బాబి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Megastar Chiranjeevi: ఆ డైరెక్టర్‏తోనే చిరంజీవి తర్వాతి సినిమా.. 'ఉప్పెన'  వేదికపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్.. | TV9 Telugu

డైరెక్టర్ బాబి మాట్లాడుతూ పవన్ రాజకీయంగా ఎదుగుతారన్న నమ్మకం తనకు ఉందని అతని పవరు పొగరు గురించి బాబి గట్టిగానే మాట్లాడడంతో మెగా అభిమానులలో పలు చర్చనీయంశం కు దారితీస్తోంది. నీకు దేవుడులాంటి తమ్ముడు నిచ్చాడు అతను చూసుకుంటాడు.. అతడు సమాధానం చెబుతాడు గట్టిగా మాట్లాడతారు.. మీలోంచి వచ్చిన మంచితనం ఆవేశం కలిస్తే పవన్ కళ్యాణ్ సార్ అంటూ చిరంజీవి పైన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు బాబి. ఈ వేదిక వద్దకు తండోపతండాలుగా విచ్చేసిన అభిమానులు పవర్ స్టార్ అభిమానులు బోలెడంత రచ్చ చేశారు. కొన్నిచోట్ల జై జనసేన అంటూ నినాదాలు కూడా వినిపించాయి అని తెలియజేశారు.

ఈ వేదికపై మెగా బ్రదర్స్ మంచితనం గురించి బాబీ మాట్లాడుతూ.. ఎందుకు మెగాస్టార్ లాంటి ఒక బిగ్గెస్ట్ వారికి కోపం రాదు.. ఎవరు ఏది అన్న ఆయనే బాధపడతారు తప్ప ఎవరిని బాధ పెట్టరు అని బాబి తెలిపారు. అవతలి వారు అన్నారని మనం కూడా అనేస్తే వారి తల్లితండ్రులు ,భార్య పిల్లలు ఉంటారు వారు మరింత బాధపడతారని చిరంజీవి ఒక లైన్లో చెప్పారట. అందుకే చిరంజీవి సిని పరిశ్రమకు ఒక్కటే మెగాస్టార్ రాజకీయాలలో ఆయన పనికిరారని కూడా బాబి తెలిపారు.