కాంగ్రెస్‌లో కల్లోలం..రేవంత్‌ని సైడ్ చేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతుంది..ఆ పార్టీని సొంత పార్టీ నేతలే ముంచుతున్నారు. ఎప్పటినుంచి కాంగ్రెస్ లో నేతల మధ్య కలహాలు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర రచ్చ జరుగుతుంది. కాంగ్రెస్ లో చాలామంది సీనియర్లు ఉండగా, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పి‌సి‌సి ఇవ్వడం ఏంటని..కాంగ్రెస్ లో చాలామంది నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తూ వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఏ స్థాయిలో విమర్శలు చేశారో చెప్పాల్సిన పని లేదు.

అయితే ఈ చిచ్చు ఇలాగే కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయం నడుస్తూ వస్తుంది. ఇదే క్రమంలో తాజాగా పార్టీలో పదవులని భర్తీ చేయడం కూడా చిచ్చు రాజేసింది. పార్టీ పదవుల్లో రేవంత్ తో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క లాంటి వారు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ వర్గం సొంతం చేసుకోవాలని చూస్తుందని ఫైర్ ఆయారు. పైగా సగం పదవులు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇచ్చారని అన్నారు.

TS CONGRESS FIGHT: ముదిరిన లొల్లి

దీంతో టీడీపీ నుంచి వచ్చిన వారు పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేశారు.  టీపీసీసీ పోస్టులకు సీతక్క సహా 12 మంది రాజీనామా చేశారు. ఇక రేవంత్‌ టార్గెట్‌గా కార్యాచరణపై కసరత్తు చేస్తున్న సీనియర్‌ నేతలు.. తాజాగా గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి డుమ్మా కొట్టారు. హాత్‌సే హాత్‌ జోడో యాత్ర కార్యక్రమాన్ని తెలంగాణలో ఎలా జరపాలన్నదానిపై నిర్వహించిన సమావేశానికి భట్టివిక్రమార్క, ఉత్తమ్‌, మధుయాష్కీ, జగ్గారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితర అసంతృప్త నేతలు గైర్హాజరయ్యారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది…దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు కాంగ్రెస్ నేతలని బీజేపీలోకి లాగాలని చూస్తున్నారు. ఇటు సీనియర్లు అంతా రేవంత్ రెడ్డిని పి‌సి‌సి నుంచి తప్పించడానికే గట్టిగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరికి ఈ రచ్చ ఎక్కడవరకు వెళుతుందో చూడాలి.