శ్రీ‌లీల కోసం ఎన్నో సార్లు ఆ ప‌ని చేశా.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన నాగార్జున!

యంగ్ సెన్సేషన్ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు `ధమాకా` సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ శ్రీలీల కలిసి బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ ఎపిసోడ్ లో సందడి చేశారు. బిగ్ బాస్ షో వేదికగా ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్రమంలోనే నాగార్జున శ్రీలీల అందం గురించి పొగడ్తలు వర్షం కురిపిస్తూ ఆమెను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

అలాగే శ్రీలీల కోసంమే `ధమాకా`లోని జింతాక జింతాక సాంగ్ ఎన్నో సార్లు చూశానంటూ సీక్రెట్ ను బయటపెట్టారు. అంతేకాదు స్టేజ్ పైనే శ్రీలీల తనతో ఎప్పుడు నటిస్తుంది అంటూ నాగార్జున ప్రశ్నించడం హైలెట్ గా నిలిచింది. మొత్తానికి యంగ్ బ్యూటీ అందానికి అక్కినేని మన్మధుడు పడిపోయాడని చెప్పాలి.