ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రహ్మానందం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వించదగ్గ హాస్యనటుడు అని చెప్పవచ్చు. దాదాపుగా 1200 చిత్రాలలో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సైతం గుర్తింపు పొందారు. ప్రస్తుతం పలు సినిమాలు చేయడం మానేశారు. తనకు నచ్చిన సబ్జెక్టు ఉన్న చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు బ్రహ్మానందం. తాజాగా చెడ్డి గ్యాంగ్ తమాషా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ హీరో డైరెక్టర్గా వ్యవహరించారు.

Brahmanandam released the trailer of 'Cheddi Gang' funny movie
గాయత్రి పటేల్ హీరోయిన్ గా నటించిన ఎంటర్టైన్మెంట్ పై CH క్రాంతి కిరణ్ నిర్మించారు. ఆదివారం జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా బ్రహ్మానందం రావడం జరిగింది. ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడాలు లేవు కేవలం ఒక్క సినిమా కోసమే మనమందరం ఎంతో కష్టపడుతూ ఉంటాము.. ఇక పెద్ద హీరో అయితే హిట్ అవుతుంది.. చిన్న హీరో సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది అన్నమాటలు సత్యాలే .. ఏ సినిమా అయినా సరే కథ బాగుంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందని బ్రహ్మానందం తెలియజేయడం జరుగుతోంది.

ఇక హాస్య నటులు తీసే సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని బ్రహ్మానందం అంటున్నారు.కామెడీ ప్రపంచానికి తెలియాలని మా గురువుగారు జంధ్యాల చెప్పే వారిని తెలియజేశారు.కామెడీ ఉన్న నేపథ్యంలో సినిమాలని బ్రతికించాలని ఈ సినిమా వేడుకకు హాజరయ్యారని తెలిపారు బ్రహ్మానందం. ఇక నిర్మాతలు కూడా ఒక రైతులాంటి వారే..నష్టాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు వినోదాన్ని పంచేందుకు ఎప్పుడు చాలా కష్టపడుతూ ఉంటారని తెలిపారు. ఒకవేళ అన్ని కుదిరితే ఈ సినిమా సీక్వెల్లో బ్రహ్మానందం నటిస్తానని తెలిపారు. ప్రస్తుతం బ్రహ్మానందం చేసిన ఈ విషయం వైరల్ గా మారుతోంది.