ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వెనుక ఇంత కథ ఉందా..!!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇటీవలే RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్స్ డైలాగులకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉందని చెప్పవచ్చు. ఎంతటి పెద్ద డైలాగు అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పే నటుడుగా పేరుపొందారు ఎన్టీఆర్ నటించిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు.

19 years for Student No 1
ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన రాజమౌళి స్క్రీన్ ప్లే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అయితే ఈ సినిమాకు ముందుగా ఎన్టీఆర్ ను హీరోగా అనుకోలేదట.ఈ సినిమా కోసం మరొక హీరోని ముందుగా ఎంపిక చేశారట. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వని దత్ నిర్మించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అశ్విని దత్ మాట్లాడుతూ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అశ్విని దత్ మాట్లాడుతూ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాస్ ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతోనే ప్రభాస్ ని హీరోగా పరిచయం చేయాలనుకున్నామని తెలిపారు అశ్వని దత్. ఆ దిశగా చర్చలు కూడా జరిపామని అదే సమయంలో హరికృష్ణ నుంచి ఫోన్ రావడంతో ఈ సినిమా ఎన్టీఆర్ కు వచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ ను కాదని ఎన్టీఆర్ను తీసుకువచ్చామని అశ్వని దత్ తెలియచేశారు. ఇక 2001లో ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.