చీర‌లో సిగ్గుప‌డుతూ కీర్తి సురేష్ కొంటె పోజులు.. చూపు తిప్పుకోలేక‌పోతున్న కుర్రాళ్లు!

టాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో మలయాళం ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఒకరు. `నేను శైలజ` వంటి సూపర్ హిట్ మూవీ తో తెలుగు తెర‌కు పరిచయం అయిన కీర్తి సురేష్.. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది.

జాతీయ‌ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే తెరపై కీర్తి సురేష్ గ్లామర్ రోల్స్ చేస్తుంటుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ఆరబోసింది లేదు.

సోషల్ మీడియాలోనూ పద్ధతిగానే కనిపించేది. కానీ ఇటీవల ఈ బ్యూటీ సైతం అందాల బౌండరీలు దాటేసింది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో అందరి మత్తులో చెడగొడుతోంది.

తాజాగా వైట్ కలర్ ఫ్లోరల్ శారీ, స్లీవ్ లెస్‌ బ్లౌజ్‌ ధరించి సిగ్గుపడుతూ కొంటెగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్‌ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతున్నాయి. కీర్తి అందాల సోయగాల‌కు కుర్రాళ్ళు చూపు తిప్పుకోలేకపోతున్నారు.

అంత అందంగా మహానటి మెరిసిపోతోంది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు నానికి జోడిగా `ద‌స‌రా` సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా శంక‌ర్`కు సైన్ చేసింది. మరోవైపు మలయాళంలోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌ను టేక‌ప్‌ చేసింది.