అప్పుడే మగాళ్లందరి కలల్లోకి వెళ్లిపోయింది.. శ్రీ‌లీల‌పై స్టార్ డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్!

`పెళ్లి సంద‌D` మూవీతో టాలీవుడ్ అడుగు పెట్టిన అందాల భామ శ్రీ‌లీల‌.. ఇప్పుడు `ధ‌మాకా` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు.

ఇందులో రవితేజ, శ్రీలీల జంట‌గా న‌టిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో నటించారు. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన స్టార్ డైరెక్ట‌ర్ రాఘవేంద్రరావు.. ర‌వితేజ‌, శ్రీ‌లీల పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

పెళ్లి సందD సినిమాతో శ్రీ‌లీల ఆంధ్రదేశంలోని మగాళ్లందరి కలల్లోకి వెళ్లిపోయింది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసిన రాఘవేంద్రరావు.. రవితేజ మామూలోడు కాద‌ని, తాను అల్లరి ప్రియుడు సినిమా తీసినప్పుడు అందులో ఆర్కెస్ట్రా గ్రూపులో చిన్నపాత్ర వేశాడు. అతను డ్రమ్ములు వాయించడం చూసే, ఏదో ఒక రోజున ఇండస్ట్రీని వాయించేస్తాడని అప్పుడే చెప్పానంటూ పేర్కొన్నారు. అలాగే త‌న సినిమా త‌ర్వాతే ఈ ఇద్దరూ స్టార్స్ కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంద‌ని, ఈ ఇద్దరి కలయికలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్న‌ట్లు రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. మ‌రియు ధ‌మాకా సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని ఆకాక్షించారు.