తమిళ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తన తెరకెక్కించే సినిమాలు హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న విశాల్ ప్రస్తుతం రాజకీయ ఎంట్రీ పైన పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. చెన్నైలో లాఠీ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విశాల్ తన రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడం జరిగింది.
విశాల్ మాట్లాడుతూ.. లాఠీ సినిమా ప్రమోషన్ లో తాను రాజకీయాలలోకి రావడం కన్ఫామ్ అని కూడా తెలియజేశారు. అయితే ఏపీలో వస్తున్న వార్తల ప్రకారం తనకు కుప్పం నుంచి పోటీ చేసి ఆలోచన అయితే లేదని సమాజ సేవ చేసేందుకు రాజకీయాలలోకి అడుగుపెడుతున్నానని..కానీ ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను అంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు విశాల్. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోటీకి దిగుతున్నారన్న వస్తున్న వార్తలపై నిజం లేదని కుప్పం ప్రాంతంలో గతంలో తన తండ్రి గ్రానైట్ వ్యాపారం చేయడం వల్ల మూడేళ్ల పాటు అక్కడే ఉన్నాను అందుచేతనే అక్కడి ప్రజలతో తనకు బాగా అనుబంధం ఏర్పడిందని తెలిపారు.
అయితే ఆరు నెలల క్రితం కుప్పం నుంచి టీడీపీ అధినేత పై హీరో విశాల్ పోటీ చేస్తున్నారనే వార్తలు బాగా వినిపించాయి. విశాల్ తో వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు అప్పట్లో ఊహాగానాలు బాగానే వినిపించాయి.దీనిపై ఇప్పుడు విశాల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. విశాల్ వస్తున్న సమయంలో ఈ వార్తల్లో నిజం లేదని తెలిపారు. అయినా ఈ విషయం ప్రస్తుతం వైరల్ గానే మారుతోంది.