బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే.. ‘వీర సింహారెడ్డి’ నుంచి పవర్ఫుల్ డైలాగ్ లీక్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. తను చేసే సినిమాలతో యువ హీరాలకు సైతం పోటీ ఇస్తున్నాడు బాలయ్య. గత సంవత్సరం అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలకృష్ణ. ఈ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి.. ఈ సినిమాను క్రాక్ తో సూపర్ హిట్ అందుకున గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు.

Director Gopichand Malineni's BIG Statement on Veera Simha Reddy

దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో చాలా సంవత్సరాలు తర్వాత తండ్రి కొడుకుల పాత్రలో నటిస్తూ ఉండటం గమనార్హం. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ఓ డైలాగ్ లీకైంది. ఆ లీకైన డైలాగ్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో పాటు ఈ మూవీ రేంజ్ మరింత పెరిగే విధంగా ఉంది. బాలకృష్ణ దగ్గర నుంచి ఆ డైలాగ్ వస్తుంటే థియేటర్‌లో బాలయ్య అభిమానులకు అది ఎంతో కిక్కిస్తుంది.

Balakrishna Veera Simha Reddy Shooting Completed - Telugu Rajyam

” పులివెందుల అయినా పులిచర్ల అయినా పులిబిడ్డ ఈ వీరసింహారెడ్డి.ఈ వీరసింహారెడ్డి ప్రజల ముందు ఉంటే సింహం ముందు ఉన్నట్టే. ఆ సింహాన్ని ఎదురించి వెళ్లే దమ్ము ఉంటే నువ్వు నన్ను దాటి ప్రజల వద్దకు వెళ్లరా” ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులకు ఈ డైలాగ్ ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. బాలయ్య దగ్గర నుండి మాస్ డైలాగులు వస్తుంటే ఆ డైలాగులకు థియేటర్‌లు దద్దరిల్లి పోవాల్సిందే. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుండగా.. రీసెంట్‌గా వీరిద్దరికి సంబంధించిన సుగుణసుందరి సాంగ్ రిలీజ్ అవ్వగా ఆ సాంగ్ కూడా అదిరిపోయే వ్యూస్ ను దక్కించుకుని యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.

Balakrishna Veerasimha Reddy: ఎట్టకేలకు పూర్తి అయిన వీరసింహారెడ్డి.. లేటెస్ట్ అప్డేట్ ఇదే | Balakrishna Veera Simha Reddy Makers reveal shoot update details, NBK107 , Veera Simha Reddy, Nandamuri ...

అఖండ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను నిర్మాతలు ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ అయ్యిందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లీకైన డైలాగ్ కూడా బాలయ్య అభిమానులకు ఎంతగానో ఖుషి చేస్తుంది. ఇక ఈ సినిమాతో బాలయ్య కెరియర్ లో మరో ఆదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకోబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు.