‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి అదే హైలెట్ …థియేటర్స్ లో విజిల్స్ మారుమోగు పోవాల్సిందే..!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సూపర్ హిట్ తరవాత పక్క మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న వాల్తేరు వీరయ్య ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అవ్వగా సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకులు ముందు రాబోతుంది. యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ స్పెషల్ పోలీస్ పాత్రలో న‌టించబోతున్నాడు. ఇప్పటికే ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ ప్రోమో విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.

Mega 154: Chiranjeevi And Bobby's Upcoming Movie Is Titled 'Waltair Veerayya '…

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను దర్శకుడు మెగా అభిమానులకు ఫుల్ మీల్స్‌ పెట్టేలా రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రెండు ఐకానిక్ సీన్స్ ఉన్నాయట. ఆ సన్నివేశం వచ్చిన టైంలో థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ కి మరింత ఊపు వచ్చేలా ఆ సీన్స్ ని దర్శకుడు బాబి స్పెషల్ కేర్ తీసుకునే రూపొందించినట్లు తెలుస్తుంది.

Waltair Veerayya: బాస్ పార్టీ.. ముఠా మేస్త్రిని దించేశారుగా - NTV Telugu

అయితే ఆ రెండు సన్నివేశాలలో ఒకటి ముఠామేస్త్రి సినిమాలో వచ్చే ఈ ‘పేటకు నేనే మేస్త్రి అనే సాంగ్ లో చిరు వేసిన డాన్స్ స్టాప్’.. చిరంజీవి కెరియర్‌ను మలుపు తిప్పిన ‘ఖైదీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్’. ఈ రెండు సన్నివేశాలు మెగా అభిమానులు తో పాటు సినీ అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. అయితే ఖైదీ సినిమాలో వచ్చే పోలీస్ స్టేషన్ సన్నివేశం చిరంజీవిని మాస్ హీరోగా నిలబడితే.. ముఠామేస్త్రి స్టెప్ దాదాపు దశాబ్దం పాటు ప్రతి స్టేజ్ పైన కనిపించింది. అందుకే అవి ఐకానిక్ మూమెంట్స్ అయ్యాయి.

Waltair Veerayya: మూల విరాట్ ఆంధ్రాలో… మాస్ మహారాజ్ తెలంగాణాలో… - NTV Telugu

అలాంటి ఆ రెండు సన్నివేశాలని వాల్తేరు వీరయ్య సినిమాలో పెట్టి మెగా అభిమానుల్లో జోష్ ఇవ్వాలని దర్శకుడు బాబి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాత చిరంజీవి బయటకు వస్తాడని ఈ సినిమా మెగా అభిమానులకే కాకుండా సినీ అభిమానులందరికీ ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో చిరంజీవి ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.