జాన్వీ కపూర్.. ఈ అందాల హాట్ బాంబ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ.. `ధడక్` అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.
కానీ ఒక్క హిట్టు పడడం లేదు. ఈమె నుంచి ఈ ఏడాది గుడ్ లక్ జెర్రీ, మిలి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు సైతం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే వరుస ప్లాపుల్లోనూ జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. బాలీవుడ్ కథనాల ప్రకారం.. జాన్వీ ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 3 నుంచి 6 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను ఛార్జ్ చేస్తుందట.
మూడు కోట్ల లోపు ఏ సినిమాకు ఈ అమ్మడు సైన్ చేయడం లేదంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇకపోతే జాన్వీ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్టీఆర్ 30 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఖరారు అయిందని వార్తలు వస్తున్నాయి. అలాగే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలోనూ జాన్వీ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.